: ఏపీ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నికీలలు


ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గత రాత్రి పంటలను ఆగంతుకులు అగ్నికి ఆహుతి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరోసారి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెంలో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా పంటపొలాల్లో అగ్నికీలలు ఎగసిపడడంతో, నిప్పు పెట్టిన దుండగులు పొలాల్లో దాక్కున్నారేమోనని రైతులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాయపూడి గ్రామానికి చెందిన రైతులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. వరుసగా పంటలు అగ్నికి ఆహుతవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానికి భూములు ఇవ్వబోమని రైతులు ప్రతిఘటిస్తున్న ప్రాంతంలోనే మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News