: ప్రధాని, ముఖ్యమంత్రి సభకు అప్పట్లో 'ఒకే ఒక కానిస్టేబుల్' సెక్యూరిటీ!


ఇప్పుడు కార్పోరేటర్ నుంచి బడా నేత వరకూ స్థాయికి తగ్గ సెక్యూరిటీ ఉంటుంది. అభిమానులం, కార్యకర్తలం ఎవరైనా వారిని ముట్టుకునే ప్రయత్నం చేస్తే వార్ని ఈడ్చి అవతల పడేస్తారు. దీనిపై ప్రముఖ నాటక రచయిత డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 1948లో విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో నిర్మించిన 'జలఉష' నౌక సముద్ర ప్రవేశానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా వారిని ఏయూకు అప్పటి వీసీ సీఆర్ రెడ్డి ఆహ్వానించారు. ఆ సందర్భంగా జరిగిన మీటింగ్ కు ప్రధాని, ముఖ్యమంత్రి హాజరు కాగా, ఆనాటి సభకు కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ లాఠీ పట్టుకుని డ్యూటీ చేశాడని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News