: టీడీపీ కార్యకర్తల దాడి... అపస్మారక స్థితిలోకి తహశీల్దార్


అనంతపురం జిల్లాలో తాము చెప్పినా రేషన్ డీలర్ ను మార్చలేదన్న అక్కసుతో గుడిబండ తహశీల్దార్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయనను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఇప్పటికే ఐదుగురు తహశీల్దార్లు దీర్ఘకాల సెలవుపై వెళ్లినట్టు సమాచారం. అందుకు టీడీపీ నేతల బెదిరింపులే కారణమని ప్రచారం జరుగుతోంది. కాగా, జరుగుతున్న దౌర్జన్యాలకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News