: జావా సముద్రంలో కూలిన విమానం: ఇండోనేషియా
ఇండోనేషియా నుంచి సింగపూర్ బయలుదేరి నిన్న ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఆసియా విమానం జావా సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఇండోనేషియా అధికారులు తెలిపారు. విమానం కూలిపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు ఇండోనేషియా నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ వివరించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం సముద్రంలో కూలి నీటి అడుగునకు చేరినట్టు తెలిపారు. విమాన శకలాల అన్వేషణకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆటంకంగా మారాయని పేర్కొన్నారు. జావా సముద్రంలో విమాన శకలాలు కనిపించాయని ఇండోనేషియా మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని ఎయిర్ ఆసియా, ఇండోనేషియా ప్రభుత్వాలు ధ్రువీకరించలేదు.