: అదనపు చార్జీలపై ఎయిర్ టెల్ వెనుకంజ
స్కైప్, వైబెర్ వంటి యాప్స్ వాడుతున్న వారి నుంచి అదనపు చార్జీలను వసూలు చేయాలన్న తన నిర్ణయాన్ని ఎయిర్ టెల్ వెనక్కు తీసుకుంది. కేవలం డేటా మాత్రమే వాడుకుంటూ, ఈ యాప్స్ నుంచి ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలను అందుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తొలుత ఎయిర్ టెల్ అదనపు చార్జీల నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ వంటి నియంత్రణా సంస్థల నిబంధనలు అందుకు అంగీకరించవని తెలుసుకున్న కంపెనీ చార్జీల పెంపును రద్దు చేసింది. కాగా, ఇంటర్నెట్ టెలిఫోనీపై ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. సమీప భవిష్యత్తులో ఇంటర్నెట్ మాధ్యమంగా చేసే కాల్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతాయని అంచనా.