: ఆర్టీపీపీ పనుల్లో ప్రమాదం... శ్లాబ్ కూలి ఏడీఈ మృతి, ఐదుగురికి గాయాలు
కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో కొద్దిసేపటి క్రితం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోని ఆరో యూనిట్ నిర్మాణ పనుల వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న వారిపై ప్రాజెక్టు శ్లాబ్ విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఏడీఈ నాగేంద్ర అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని హుటాహుటిన ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.