: భారత్ లో సేవలు యథాతథం: ఎయిర్ ఏషియా


విమానం గల్లంతైన నేపథ్యంలో భారత్ లో తమ సర్వీసులను రద్దు చేయబోవడం లేదని ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళుతున్న విమానం అదృశ్యం కావడం భారత్ లో తమ సేవలపై ప్రభావం చూపబోదని ఎయిర్ ఏషియా ప్రతినిధి తెలిపారు. తమ కార్యకలాపాలు యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎయిర్ ఏషియా సంస్థ టాటా సన్స్, టెల్ స్ట్రా ట్రేడ్ ప్లేస్ సంస్థల భాగస్వామ్యంతో భారత్ లో సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News