: హైదరాబాద్ హుక్కా సెంటర్లపై పోలీసు దాడులు... పలువురు మైనర్ల అరెస్ట్


ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాదులో హుక్కా సెంటర్ల కార్యకలాపాలు మళ్లీ జోరందుకున్నాయి. ప్రత్యేక వసతులతో హుక్కా సెంటర్లను నిర్వహించుకోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో... హైదరాబాదులో నిన్నటిదాకా మూతపడ్డ హుక్కా సెంటర్లు తిరిగి తెరచుకున్నాయి. నిబంధలనకు విరుద్ధంగా మైనర్లతో పాటు మహిళలను కూడా సెంటర్లలోకి అనుమతిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. మితిమీరుతున్న హుక్కా సెంటర్లపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హుక్కా సెంటర్లలో హుక్కా మత్తులో మునిగిన మైనర్లు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు హుక్కా సెంటర్లపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News