: 'లెజెండ్' పది సింహాలకు సమానం అన్నారు: సమీర్


నటుడు సమీర్ 'లెజెండ్' సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక ఉండేదని, అయితే, అది నెరవేరలేదని తెలిపారు. అయితే, బాలకృష్ణతో నటించడంతో ఆ లోటు తీరిపోయిందని అన్నారు. తాను ఇప్పటివరకు మూడు చిత్రాల్లో బాలయ్యతో నటించానని, ఆయనతో నాలుగో చిత్రం కూడా చేస్తున్నానని, ఆ సినిమా ఫ్యాన్స్ కు పండగేనని చెప్పారు. ఇక, 'సింహా' సినిమా సమయంలో దర్శకుడు బోయపాటితో ఆసక్తికర సంభాషణ జరిగిందని సమీర్ తెలిపారు. ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయిలో చూపించారని, లెజెండ్ లో ఇంకేమి చూపగలరని బోయపాటిని అడిగానని చెప్పారు. అందుకు బోయపాటి, 'సింహా'లో ఒక్కటే సింహం ఉంటుందని, 'లెజెండ్' పది సింహాల పెట్టు అని చెప్పారని సమీర్ గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News