: సందడి చేసిన బాలయ్య, బోయపాటి
కడప జిల్లా ప్రొద్దుటూరులో 'లెజెండ్' విజయోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ విచ్చేశారు. వారి రాకతో అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబుకింది. బాలయ్య కోసం వేదికపై సింహాసనం తరహాలో ప్రత్యేక ఆసనాన్ని రూపొందించారు. తెల్ల దుస్తుల్లో ఆయన ఎంతో హుందాగా కనిపించారు. వేడుకలో భాగంగా బాలకృష్ణ పలువురికి విజయోత్సవ జ్ఞాపికలు అందజేశారు.