: బెజవాడలో 'ముకుంద' విజయోత్సవం
మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ముకుంద' చిత్రం విజయోత్సవం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్ లో అత్యధికులు పవన్ కల్యాణ్ పోస్టర్లు ప్రదర్శించడంతో యాంకర్ శ్యామల సైతం 'జై పవన్ కల్యాణ్' అనక తప్పలేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, 'ఠాగూర్' మధు నిర్మించిన ఈ సినిమాతో వరుణ్ తేజ్ తెరంగేట్రం చేయడం తెలిసిందే. ఈ సినిమాలో మెగా హీరో సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ నెల 24న రిలీజైన 'ముకుంద' చిత్రం మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. తొలి సినిమా అయినా వరుణ్ తేజ్ ఆకట్టుకునే రీతిలో నటించాడని విమర్శకులంటున్నారు.