: ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఏర్పాట్లు ముమ్మరం
నెల్లూరు జిల్లా నేలపట్టులో ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ నేడు ఏర్పాట్లను పరిశీలించారు. జనవరి 9, 10, 11 తేదీల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. నేలపట్టులో పర్యటించిన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, నేలపట్టులో నీరు తక్కువగా ఉన్నందున ఈ ఏడాది ఫ్లెమింగో పక్షులు తక్కువ సంఖ్యలో వచ్చాయన్నారు. ఈ ఫెస్టివల్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఏడాది పలు దేశాల నుంచి ఫ్లెమింగో పక్షులు నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు వద్దకు వలస వస్తాయి. అక్కడ సంతానోత్పత్తి జరుపుకుని, పిల్లలతో కలిసి స్వస్థలాలకు పయనమవుతాయి. ఈ పక్షుల కోసం జిల్లాలోని నేలపట్టులో ప్రభుత్వం సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఫ్లెమింగోలతో పాటు పెలికన్లు, సైబీరియన్ కొంగలు తదితర విదేశీ పక్షులను ఈ ప్రాంతంలో విశిష్ట అతిథులుగా పరిగణిస్తారు.