: తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం!


ఏరియల్ సర్వేల పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వినియోస్తున్న హెలికాఫ్టర్ లో కొద్దిసేపటి క్రితం సాంకేతిక లోపం తలెత్తింది. నేటి ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్ బయలుదేరిన సంగతి తెలిసిందే. సీఎం తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో ఆగాల్సి ఉంది. అయితే, హెలికాఫ్టర్ అక్కడ కిందకు దిగకుండానే వెళ్లిపోయింది. దీంతో, అధికారులు హైరానా పడ్డారు. సాంకేతిక లోపం కారణంగానే సీఎం హెలికాఫ్టర్ వనస్థలిపురంలో దిగకుండానే వెళ్లిపోయిందని ఆ తర్వాత అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News