: గాంధీ ఆసుపత్రిలో 17 నెలల బాలుడికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ


హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నా, క్రమంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆరుగురు వ్యక్తులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరగా, తాజాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 నెలల బాలుడు విశ్వజిత్ కు వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News