: జసోదాబెన్ కోరిన సమాచారాన్ని ఇవ్వలేం: పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జసోదాబెన్ అడిగిన సమాచారాన్ని ఇవ్వలేమని పోలీసులు తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత నిబంధనల మేరకు పోలీసులు ప్రధాని భార్య హోదాలో జసోదాబెన్ కు భద్రత కల్పించారు. అయితే తన అనుమతి లేకుండా తనకు భద్రత ఎలా కల్పిస్తారని నాడు అసహనం వ్యక్తం చేసిన జసోదాబెన్, సదరు అంశానికి సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం స్థానిక ఇంటెలిజెన్స్ బ్యూరో కిందకు వస్తున్నందున, సమాచారాన్ని అందించలేమని తాజాగా మెహ్ సానా పోలీసులు తెలిపారు. సమాచార హక్కు చట్టం కిందకు ఇంటెలిజెన్స్ బ్యూరో రాదని తెలిపిన పోలీసులు, జసోదాబెన్ అడిగిన సమాచారాన్ని ఇవ్వలేమని తేల్చిచెప్పారు.