: ఏపీకి ప్రత్యేక హోదాపై 15 రోజుల్లో స్పష్టత: మంత్రి సుజనా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై సమాలోచనలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. మరో 15 రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సుజనా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి సమాధానమిచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ఇచ్చే రాయితీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందన్నారు. రాష్ట్రానికి సౌర విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉందని మంత్రి పేర్కొన్నారు.