: 'బిగ్ బాస్' షోలో విక్రమ్ 'ఐ' ప్రమోషన్


'ఐ' చిత్రం కోసం నటుడు విక్రమ్ ప్రచారానికి సన్నద్ధమయ్యాడు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న విక్రమ్, పాప్యులర్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 8'లో తన సినిమాను ప్రమోట్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో, ఈ షో వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ తో కలిసి రూపొందించే ప్రత్యేక ఎపిసోడ్ లో ఈ సదరన్ స్టార్ కూడా పాల్గొంటాడు. "విక్రమ్ పాల్గొనే ఎపిసోడ్ ను ఈ ఆదివారం 'బిగ్ బాస్' సెట్స్ పై చిత్రీకరిస్తారు. అదే సమయంలో 'ఐ' హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు" అని విక్రమ్ మేనేజర్ మీడియాకు తెలిపాడు. దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ భారీ ప్రాజెక్టుకు ఏఆర్ రహ్మాన్ సంగీతం సమకూర్చాడు.

  • Loading...

More Telugu News