: గొప్పలకు పోయి రూ.లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన కేసీఆర్ సర్కారు: షబ్బీర్ అలీ


తెలంగాణలో కేసీఆర్ సర్కారు రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. గొప్పలకు పోయి ఆయన భారీ బడ్జెట్ తీసుకొచ్చారని, ఇప్పటి వరకూ విడుదల చేసింది మాత్రం కేవలం రూ.21 వేల కోట్లేనని ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మరో 3 నెలల కాలంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున మిగిలిన రూ.80 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారో కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు రంగాలకు భారీ స్థాయిలో నిధులను కోత పెట్టే అవకాశం ఉందని షబ్బీర్ అంచనా వేశారు.

  • Loading...

More Telugu News