: పాక్ లో మరిన్ని దాడులకు టెర్రరిస్టుల వ్యూహరచన!
పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడితో ఉలిక్కిపడిన పాకిస్థాన్ సర్కారు, ఆగమేఘాలపై టెర్రరిస్టులకు మరణశిక్షపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం తెలిసిందే. దీంతో, పలువురు టెర్రరిస్టులకు మరణశిక్ష అమలుచేశారు. ఈ నేపథ్యంలో, జైల్లో ఉన్న తెహ్రీక్-ఏ-తాలిబన్ ఖైదీలు దేశవ్యాప్తంగా ఉన్న తమ సహచరులతో మరిన్ని దాడులకు పథకాలు వేసినట్టు ఓ అధికారి తెలిపారు. పెషావర్ తరహా దాడులకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఓ ఉన్నతస్థాయి భద్రత సంస్థ అందించిన సమాచారం మేరకు ఇతర భద్రత సంస్థలు అప్రమత్తం అయ్యాయని వివరించారు. ఇప్పుడు నిఘా వర్గాల హెచ్చరికలను అలక్ష్యం చేస్తే మరో విషాదం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ జైళ్లలో లంచం ఇస్తే అన్నీ లభ్యమవుతాయని, మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.