: నేడు జమ్ము కాశ్మీర్ గవర్నర్ ను కలవనున్న బీజేపీ, పీడీపీ
జమ్ము కాశ్మీర్ లో దాదాపు ఎక్కువ సీట్లు గెలుచుకున్న పీడీపీ, బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై ఈరోజు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలవనున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ ప్రతిపాదనలు సమర్పించాలని నిన్న (శుక్రవారం) గవర్నర్ ఆ రెండు పార్టీలకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆ పార్టీల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మద్దతుదారులను కూడగట్టుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని గవర్నర్ ను కలసినప్పుడు బీజేపీ కోరే అవకాశముందని తెలుస్తోంది.