: కేజ్రీవాల్ కు ఢిల్లీ బీజేపీ నేత లీగల్ నోటీసు


ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తమ ప్రచార పోస్టర్లపై ఫొటో వేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత జగదీష్ ముఖి తీవ్రంగా మండిపడ్డారు. తన ఫొటోను దుర్వినియోగం చేశారంటూ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు లీగల్ నోటీసు పంపారు. ప్రస్తుతం ఆ పోస్టర్లు ఆటో రిక్షాలపై ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నాయి. "నా అనుమతి లేకుండా నా ఫొటో ఉపయోగించినందుకు కేజ్రీకు నేను లీగల్ నోటీసు పంపాను. ఇంకా మా పార్టీ ఎలాంటి ప్రకటన చేయకముందే నన్ను సీఎం అభ్యర్థిగా ఎలా చూపుతారు?" అని ముఖి ప్రశ్నించారు. అయితే తన నోటీసుపై నిర్దేశించిన సమయం లోపల కేజ్రీ అభిప్రాయం కోరానని, కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. ఈ తీవ్రమైన అంశంపై కచ్చితంగా ఆయనను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News