: రుణం ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్ కిడ్నాప్
తానడిగిన రుణం ఇవ్వలేదని స్నేహితులతో కలసి బ్యాంకు మేనేజర్ ను కిడ్నాప్ చేశాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగింది. యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా కార్యాలయంలో పినమళ్ళ నరేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం అప్పు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. అతని అప్లికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. దీంతో ఆగ్రహానికి లోనైన నరేష్ తన మిత్రులతో కలసి బ్యాంకు మేనేజర్ రమేష్ ను కిడ్నాప్ చేశాడు. సుమారు మూడు గంటల పాటు నిర్బంధించి శారీరకంగా హింసించారు. అనంతరం రుణం మంజూరు చేస్తానని చెప్పి బతుకుజీవుడా అనుకుంటూ వారి నుంచి తప్పించుకు వచ్చాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.