: ప్రముఖ విద్యావేత్త సుబ్బారావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా సుదీర్ఘ కాలం సేవలందించిన సుబ్బారావు కన్నుమూశారు. విద్యాసంస్థలకు మార్గదర్శకాలు ఇవ్వడంలో సుబ్బారావు ఖ్యాతి గడించారు. విద్యావేత్తగానే కాకుండా మానవతావాదిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. తెలుగు రచయితలకు ఆయన అందించిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. సుబ్బారావు మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. రాజకీయ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ... సుబ్బారావు ఎల్లప్పుడూ నిరాడంబరంగానే ఉండేవారు.