: 2015లో రెండు రాష్ట్రాల్లో టీడీపీకి ఇబ్బందులే!: మహాకామేశ్వరీ పీఠాధిపతి జోస్యం


2015లో తెలుగు రాష్ట్రాలు మిశ్రమ ఫలితాలను చూస్తాయని మహాకామేశ్వరీ పీఠాధిపతి మహర్షి యద్ధనపూడి అయ్యన్నపంతులు పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంతాచార్యులు వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రితో కలసి ఆయన కొత్త సంవత్సర క్యాలెండరు, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరంలో జరిగే పరిణామాల్ని జోస్యంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో అపశ్రుతి జరగవచ్చని ఆయన అన్నారు. తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వలసలను మరింతగా ప్రోత్సహిస్తారని అంచనా వేశారు. ఈ సంవత్సరంలో 2 పెద్ద తుపానులు వస్తాయని, పాకిస్థాన్‌ ఉగ్రవాదుల చొరబాట్లు అధికమైనా, భారత్ దీటైన జవాబు చెబుతుందని మహర్షి జోస్యం చెప్పారు. బంగారం, వెండి ధరలు పెరుగుతాయని, ప్రజలు యజ్ఞయాగాలు, దైవధ్యానం చేయడంవల్ల మరింత సానుకూలత ఏర్పడుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News