: ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... స్కోరు 389/7
మెల్బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఫస్ట్ సెషన్ లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది. మిచెల్ జాన్సన్ 28 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు. మరో ఎండ్ లో కెప్టెన్ స్మిత్ 128 పరుగులతో ఆడుతున్నాడు. అతనికి అండగా హారిస్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 389 పరుగులు.