: కరాచీలోనే ఉన్న దావూద్ ఇబ్రహీం


ఇండియాకు మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఉన్నాడు. రెండు దశాబ్దాల క్రితం పాక్ పారిపోయిన ఈ అండర్ వరల్డ్ డాన్... కరాచీ శివార్లలోని క్లిప్టన్ ప్రాంతంలో ఉన్నాడని ఓ పాశ్చాత్య నిఘా సంస్థ కనిపెట్టింది. ఓ ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్ లోని ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సంభాషణలను సదరు నిఘా సంస్థ రికార్డు చేసింది. దీంతో, దావూద్ పాక్ లోనే ఉన్నాడన్న విషయం మరోసారి స్పష్టమయింది. ఈ ఏడాది ప్రారంభంలో దావూద్ ను మట్టుబెట్టేందుకు ఇండియన్ కమెండోలకు అవకాశం వచ్చింది. అయితే, దావూద్ ను హతం చేసే చివరి క్షణంలో భారత్ కు చెందిన ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి... దావూద్ ను కాల్చరాదని ఆదేశాలు జారీ చేసినట్టు ఇటీవలే కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News