: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ
సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన అనంతరం స్వదేశంలో తొలి క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు ఆయన భారత్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సత్య నాదెళ్ల, ప్రధాని మోదీతో భేటీ కావడం ఇది రెండోసారి.