: ప్రత్యేక హోదాపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. సామర్లకోటలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒప్పించాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోతూపోతూ ప్రత్యేక హోదాపై ఓ ప్రకటన చేసి పోయిందని ఆయన తెలిపారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం కచ్చితమైన ప్రజాభిప్రాయసేకరణ జరుపుతుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణమాఫీ చేయడం ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. రాజధానికి భూసేకరణపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.