: వంగవీటి రంగా ఎదుగుదలను ఓర్చలేకే హత్య చేశారు: అంబటి
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా విజయవాడ నుంచి పోరాటాలు చేసిన యోధుడు వంగవీటి మోహన్ రంగా అని వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. రంగా ఎదుగుదలను ఓర్చలేకే... గాంధేయ పద్ధతులతో నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ రోజు రంగా వర్ధంతి సందర్భంగా, ఆయనకు అంబటి రాంబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ, ప్రజల మనిషి అయిన రంగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.