: భక్తులతో తిరుమల కిటకిట... సర్వదర్శనానికి 28 గంటల సమయం
వరుస సెలవులు రావడంతో తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనం నిమిత్తం వేచి ఉన్న వారితో క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లూ నిండిపోగా, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు వేచిచూస్తున్నారు. సర్వదర్శనానికి సుమారు 28 గంటల సమయం పడుతోంది. మరోవైపు అద్దె గదులు ఖాళీ కాకపోవడంతో, సీఆర్ఓ ఆఫీసు క్యూ లైన్లు సైతం రద్దీగా ఉన్నాయి. అడ్వాన్సు రిజర్వేషన్ లు చేయించుకున్న వారికి సైతం గదులు దొరకని పరిస్థితి నెలకొంది. మరో పది రోజుల పాటు తిరుమలలో రద్దీ ఇలాగే ఉండవచ్చని అంచనా.