: మంత్రగాడనే నెపంతో ఒడిశాలో గిరిజనుడి తల నరికివేత
మంత్రాలతో వశీకరణ ప్రయోగాలు చేస్తున్నాడన్న ఆరోపణలతో 62 ఏళ్ల వృద్ధుడి తల నరికి చంపాడు తోటి గ్రామస్తుడు. ఆపై తలతో సహా పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన ఓడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బఘజంతా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డుఖీ సింగ్ అనే వ్యక్తి చేతబడి, వశీకరణం తదితర ప్రయోగాలను తన కుటుంబం మీద చేశాడని ఆరోపిస్తూ, నిందితుడు అతనిని హత్య చేశాడు. డుఖీ కారణంగా తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడిందని, అందుకనే తాను ఈ హత్య చేశానని వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.