: రేపటి తొలి సెషన్ అత్యంత కీలకం: షమీ


ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారని పేసర్ మొహమ్మద్ షమీ కితాబిచ్చాడు. లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి వికెట్లు పడగొట్టామని చెప్పాడు. కొన్నిసార్లు ఎంత చక్కగా బౌలింగ్ చేసినా వికెట్లు పడవని చెప్పిన ఈ ఇండియన్ పేసర్... రేపు (రెండో రోజు) తొలి సెషన్ అత్యంత కీలకమని తెలిపాడు. తొలి సెషన్ లో ఆసీస్ ను ఆలౌట్ చేయడమే తమ లక్ష్యమని అన్నాడు. ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళతామన్న షమీ... ఒక ఎండ్ లో టైట్ చేయగలిగితే, మరో ఎండ్ నుంచి అటాక్ చేయవచ్చని చెప్పాడు. ఈ రోజు జరిగిన ఆటలో షమి 55 పరుగులిచ్చి 2 వికెట్లను కూల్చాడు.

  • Loading...

More Telugu News