: 'యశ్ చోప్రా' అవార్డు అందుకున్న బిగ్ బీ


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రముఖ నిర్మాత దివంగత యశ్ చోప్రా పేరిట నెలకొల్పిన అవార్డును నేడు ఆయన అందుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ అవార్డును బిగ్ బీకి అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ, తనకు ఎంతో ఇచ్చిన చలనచిత్ర రంగానికి మరింత సేవ చేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పారు. గత ఏడాది ఈ అవార్డును ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అందుకున్నారు.

  • Loading...

More Telugu News