: ఒమర్ పై గెలిచిన ఆనందంలో ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన పీడీపీ అభ్యర్థి
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండు చోట్ల పోటీచేయగా... ఒకచోట గెలుపొంది, మరోచోట ఓడిపోయిన సంగతి తెలిసిందే. సోనావర్ స్థానంలో ఒమర్ పై గెలుపొందిన పీడీపీ అభ్యర్థి మహ్మద్ అష్రాఫ్ మిర్ ఆనందం పట్టలేక... తన నివాసం వద్ద ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరుపుతూ, తన మద్దతుదారులతో కలసి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. దీంతో, జరిగిన పొరపాటును సరిదిద్దుకునే పనిలో పడ్డారు అష్రాఫ్ మిర్. తాను కాల్పులు జరపలేదని, తన భద్రతా సిబ్బందికి చెందిన ఏకే-47 కిందపడితే తీసి ఇచ్చానని చెప్పుకొస్తున్నారు.