: పుస్తకం రాసిన వీహెచ్... నేడు ఆవిష్కరణ


కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత వి.హనుమంతరావు పుస్తకం రాశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక... ఆ కూటమి వైఫల్యాలను క్రోడీకరిస్తూ పుస్తకాన్ని రూపొందించారు ఆయన. ఈ పుస్తకాన్ని ఈ రోజు గాంధీభవన్ లో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్, శాసనసభలో విపక్ష నేత కె.జానారెడ్డి తదితరులు హాజరవుతారు. ఈ పుస్తకంలో మోడీ పరిపాలనలోని లోటుపాట్లను హనుమంతరావు విపులంగా పేర్కొన్నారని సమాచారం.

  • Loading...

More Telugu News