: శివాలయంలో గుప్త నిధులు... విగ్రహాలు పెకిలించిన దుండగులు!


ఆ శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దాంతో కొందరు దుండగులు విగ్రహాలు పెకిలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులో జరిగింది. ఊరిలోని భవానీ శంకరాలయంలో గుప్త నిధులు దాచి ఉండవచ్చని భావిస్తూ, నిన్న రాత్రి దుండగులు గర్భగుడిలోని శివలింగం, లింగానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహాలను తవ్వారు. నేటి ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  • Loading...

More Telugu News