: అద్దె ఇంట్లోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం అద్దె ఇంటికి మారే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం తన కుటుంబం నివసిస్తున్న ఇంటిని కూల్చి, భారీ భవంతిని కట్టించుకోవాలని ఆయన భావిస్తున్నారు. కొత్త భవంతి పూర్తి అయ్యేంతవరకూ సుమారు రెండేళ్ల పాటు కుటుంబంతో పాటు ఉండేందుకు ఓ అద్దె ఇంటి కోసం బాబు అన్వేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఉన్న భవనం బాబు కొత్త నివాసంగా దాదాపు ఖరారైనట్టు తెలిసింది. ఈ ఇంటిని చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పరిశీలించి వాస్తు ప్రకారం అవసరమైన మార్పులు చేర్పులు సూచించారని సమాచారం.