: ఏడేళ్ల బాలుడి శరీరంలో ఏడు బుల్లెట్లు... బోడోల దుశ్చర్యలో వెలుగుచూసిన దారుణం


అసోంలో బోడో తీవ్రవాదులు జరిపిన దుశ్చర్యలో దారుణ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మంగళవారం సోనిత్ పూర్, కోక్రాఝార్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలపై దాడి చేసిన బోడో తీవ్రవాదులు మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా యథేచ్ఛగా కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50 మందికి పైగా మృత్యువాత పడగా, 17 మంది ఇంకా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రుల్లోని 'కలు తోడు' అనే ఏడేళ్ల బాలుడిపై బోడోలు జరిపిన కాల్పులు వారి కరడుగట్టిన వైనాన్ని వెల్లడి చేశాయి. కోక్రాఝార్ జిల్లాలోని పక్రిగురి గ్రామంలో తన చిన్న ఇంటి ద్వారం ముందు నిలిచిన కలు తోడుపై బోడోలు ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. అంతేకాక బోడోల కాల్పుల్లో తోడు తల్లి నేలకొరిగింది. ప్రస్తుతం గువాహటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తోడు శరీరం నుంచి వైద్యులు ఏడు బుల్లెట్లను వెలికి తీశారు.

  • Loading...

More Telugu News