: 'కాఫీ విత్ అరవింద్ కేజ్రీవాల్' ఖరీదు రూ.20 వేలు!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిధుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నానా తంటాలు పడుతోంది. తొలుత విందు ఏర్పాటు చేసి నిధులు వసూలు చేసిన ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత ‘సెల్పీ విత్ మఫ్లర్ మ్యాన్’ను తెరపైకి తెచ్చారు. రూ.500 లతో పేర్లు నమోదు చేసుకున్న వారిలో లాటరీలో ఎంపికైన వారు కేజ్రీవాల్ తో సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని ఆ పార్టీ కల్పించింది. ఈ కార్యక్రమానికి అంతగా ఆదరణ లభించనట్టుంది. తాజాగా మరో కొత్త తరహా పథకానికి కేజ్రీవాల్ తెరతీశారు. ‘కాఫీ విత్ అరవింద్ కేజ్రీవాల్’ పేరిట రంగప్రవేశం చేయనున్న ఈ పథకంలో కేజ్రీవాల్ తో కాఫీ తాగేసి అక్షరాల రూ.20 వేలు చెల్లించి వెళ్లాలట. కేజ్రీవాల్ తో విందులో పాల్గొని రూ.20 వేలు చెల్లించేందుకు బాగానే ఆసక్తి చూపిన ప్రముఖులు, సెల్ఫీ విత్ మఫ్లర్ మ్యాన్ ను ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. మరి రేపు నిర్వహించనున్న కాఫీ విత్ అరవింద్ కేజ్రీవాల్ అయినా సక్సెస్ అవుతుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News