: కేంద్ర బడ్జెట్ కసరత్తు షురూ...నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జైట్లీ భేటీ


2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ రూపకల్పన మొదలైంది. ఈ కసరత్తులో భాగంగా నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నిన్న రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేటి ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. సమావేశంలో భాగంగా స్థూల ఆర్థిక విధానం, ద్రవ్య సుస్థిరతలపై కీలక చర్చ జరగనుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సహకారంపై భేటీలో అరుణ్ జైట్లీ కీలక ప్రసంగం చేయనున్నారు.

  • Loading...

More Telugu News