: మైక్రోమ్యాక్స్ 'యు యురేకా'కు ఆదరణ...ఒక రోజు ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి
ప్రముఖ ఫోన్ల కంపెనీ మైక్రోమ్యాక్స్ కొత్తగా ప్రవేశపెడుతున్న 'యు యూరేకా'కు అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో మైక్రోమ్యాక్స్ నిర్దేశించిన ఒక రోజుకు ముందే రిజిస్ట్రేషన్లు ముగిస్తున్నట్టు ప్రకటించింది. అమెజాన్.ఇన్ ద్వారా ఫోన్లు రిజిస్టర్ చేసుకునేందుకు డిసెంబర్ 25 చివరి తేదీగా మైక్రోమ్యాక్స్ ప్రకటించింది. దీనికి విపరీతమైన స్పందన రావడంతో రిజిస్టర్ చేసుకున్న వారికి జనవరిలో ఫోన్లు సరఫరా చేస్తామని చెబుతూ రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. 8,999 రూపాయల విలువగలిగిన ఈ స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో పని చేయగలదు. 5.5 ఇంచుల డిస్ ప్లేతో, వెనుక కెమేరా 13 మెగాపిక్సల్, ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సల్ సామర్థ్యం కలిగి ఉండడం దీని ప్రత్యేకత.