: ప్రధాని మోదీ నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: వెంకయ్యనాయుడు
ప్రధాని మోదీ నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మంచి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగకూడదని అన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు నిలదీస్తే అధికారులు సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు రాజ్యాంగం అతిక్రమించకుండా ఉండాలని ఆయన సూచించారు.