: బాలకృష్ణకు టీఎస్సార్ జాతీయ అవార్డు
నందమూరి బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను టీఎస్సార్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది. 2011 ఏడాదికిగాను బాలయ్యకు ఈ పురస్కారం దక్కింది. టీఎస్పార్ లలితకళాపరిషత్ పేరిట టి. సుబ్బిరామిరెడ్డి ఈ జాతీయ అవార్డులను అందించనున్నారు. భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల20న శిల్పకళావేదికలో ఈ అవార్డుల బహుకరణ కార్యక్రమం జరగనుంది. కాగా 2012 సంవత్సరానికి గాను 'షిరిడీసాయి' చిత్రంలో ప్రదర్శించిన నటనకు నాగార్జున ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నాడు. ఇక 2012లో ఉత్తమ కథానాయకుడిగా 'రచ్చ' చిత్రానికి గాను రామ్ చరణ్ ఎంపికయ్యాడు. ఉత్తమ హీరోయిన్ గా 'ఈగ' చిత్రానికి గాను సమంత ఎంపికైంది.