: టచ్ స్క్రీన్ ఫోన్ వాడకంతో చురుగ్గా పనిచేస్తున్న మెదడు


టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్ వాడకం మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. టచ్ స్క్రీన్ వాడకంలో చేతివేలు, మెదడు అనుసంధానంతో పని చేస్తాయని, దీని కారణంగా మెదడు పనితీరులో మెరుగుదల ఉంటుందని, దాని కారణంగా చేతివేళ్లు ఫోన్ టచ్ స్క్రీన్ ను తాకినప్పుడు మెదడు చురుగ్గా పని చేస్తుందని స్విట్జర్లాండ్ లో ఓ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలింది. టచ్ స్క్రీన్ వినియోగంలో ఎక్కువగా బొటనవేలు వినియోగిస్తున్నారని వారు వెల్లడించారు. టచ్ స్క్రీన్ ఫోన్లు వాడుతున్నప్పుడు మెదడు పనితీరు చురుగ్గా ఉండడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News