: రైల్వేను ప్రైవేటు పరం చేయం: మోదీ
భారతీయ రైల్వేను ప్రైవేటు పరం చేయబోమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైల్వేను మరింత అభివృద్ధి పరిస్తే... అది మన దేశాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. మన రైల్వేల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు దేశ వ్యాప్తంగా నాలుగు రైల్వే యూనివర్శిటీలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ నిధులను రైల్వేల్లోకి మళ్ళించడం ద్వారా ఈ రంగాన్ని ప్రగతి దిశగా తీసుకుపోవచ్చని మోడీ అభిప్రాయపడ్డారు. రైల్వేలను ఓ ప్రయాణ అవసరంగా చూడరాదని... దేశ ప్రగతికి వెన్నెముకగా భావించాలని అన్నారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్స్ వర్క్ (డీఎల్ డబ్ల్యూ)లో 'డబ్ల్యూ డీపీ4డీ' లోకోమోటివ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా హాజరయ్యారు.