: గీతం విద్యార్థుల విహార యాత్రలో విషాదం
సరదాగా అరకు పరిసరాల్లో విహరించి వద్దామని బయలుదేరిన ఇంజినీరింగ్ విద్యార్థులకు విషాదం మిగిలింది. పదిమంది విద్యార్థులు తమతమ ద్విచక్ర వాహనాలపై లంబసింగికి వెళుతుండగా నేటి ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మాకవరపుపాలెం అవంతి కళాశాల వద్ద ఓ బైకును జీపు ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి చైతన్య కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ముంబై నుంచి వచ్చి చదువుకుంటున్నాడని, గాయపడిన చైతన్య హైదరాబాద్ వాసిగా తెలుస్తోంది.