: వైద్యురాలిపై యాసిడ్ దాడి చేయించిన మరో డాక్టర్
ఢిల్లీలోని రాజోరి మార్కెట్ సమీపంలో విధులకు వెళ్తున్న ఓ మహిళా డాక్టర్ మీద జరిగిన యాసిడ్ దాడి కేసులో మరో వైద్యుడు ప్రధాన నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడేళ్ళ క్రితం వైద్య విద్యను అభ్యసించే సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని, ఆ తరువాత యువతి అభ్యంతరం చెప్పటంతో దూరమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న వైద్యుడు ఓ కిరాయి ముఠాతో ఒప్పందాన్ని కుదుర్చుకొని యాసిడ్ దాడి చేయించాడని తెలిపారు. ఈ కేసులో దాడికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వైద్యుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. కాగా, యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా డాక్టర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె కుడి కంటి చూపు కోల్పోయే స్థితిలో ఉందని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.