: గాడ్సే చిత్రం విడుదలపై కోర్టులో దావా
'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' పేరుతో గాడ్సేపై భారతీయ హిందూ మహాసభ రూపొందించిన చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ పూణె కోర్టులో దావా దాఖలైంది. జనవరి 30న విడుదల కాబోతున్న ఈ సినిమాను నిలుపుదల చేయాలని ఉద్యమకారుడు హేమంత్ పాటిల్ సివిల్ దావా వేశారు. ఆ సినిమా బయటికి వస్తే మతపరమైన విధ్వంసాలు రేకెత్తే అవకాశం ఉందని దావాలో హేమంత్ పేర్కొన్నారు. అంతేగాక మహాత్మాగాంధీని గాడ్సే చంపిన రోజే విడుదల చేయాలనుకోవడం విద్వేషాలు రెచ్చగొట్టడమేనన్నారు.