: వాజ్ పేయికి భారతరత్నను స్వాగతించిన కాంగ్రెస్!
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న పురస్కారాలను ప్రకటిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. ‘‘అటల్ జీ, మాలవ్యాలకు భారతరత్న పురస్కారాలను స్వాగతిస్తున్నాం. వారికి మా శుభాకాంక్షలు’’ అని మాకెన్ సదరు ట్వీట్లలో పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వాజ్ పేయికి భారతరత్నపై నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయంపై జేడీయూ నేత నితీశ్ కుమార్ కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపట్లోనే మాకెన్ ప్రకటన రావడం గమనార్హం.