: మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు...దేశవ్యాప్తంగా పెరిగిన చలి


దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. జమ్మూ కాశ్మీర్ లోని లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు తగ్గిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే దాదాపుగా 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, విమాన సర్వీసులపైనా పొగమంచు ప్రభావాన్ని చూపింది. ఉత్తరప్రదేశ్ లో పొగమంచు నేపథ్యంలో పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో పది మంది దాకా మృత్యువాత పడ్డారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. మన్యంలోని లంబసింగిలో బుధవారం రాత్రి సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పెరిగిన చలి కారణంగా విశాఖ మన్యంలో నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News